Kim Jong un: నా ఎదురుగా ఓ బటన్... నొక్కితే బయలుదేరే అణు బాంబు: కిమ్ జాంగ్ ఉన్ న్యూ ఇయర్ మెసేజ్!

  • తనదైన శైలిలో న్యూ ఇయర్ విషెస్ చెప్పిన కిమ్ జాంగ్
  • తన టేబుల్ పై న్యూ క్లియర్ బటన్ ఉందన్న కిమ్
  • ఇది నిజంగా నిజం అంటూ హెచ్చరిక!

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలను తనదైన శైలిలో వినూత్నంగా తెలిపారు. తన టేబుల్ పై ఓ బటన్ ఉందని, దాన్ని నొక్కితే అణు బాంబు బయలుదేరుతుందని హెచ్చరించారు.

ఉత్తర కొరియా అణ్వస్త్ర సంపద కలిగున్న దేశమేనంటూ, "నా టేబుల్ పై ఎల్లప్పుడూ న్యూక్లియర్ బటన్ ఉంటుంది. నేనేమీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు. ఇది నిజంగా నిజం" అని ఆయన వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా ఉత్తర కొరియాపై ఆంక్షలను అమలు చేస్తున్నప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ, తన అణు పరీక్షలను కిమ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కిమ్ ను కట్టడి చేయాలని అమెరికా ఎంతగా ప్రయత్నాలు సాగిస్తున్నా, ఫలితం మాత్రం కనిపించని పరిస్థితి నెలకొంది.

Kim Jong un
North Korea
Nuclear Missile
  • Loading...

More Telugu News