Rajnath singh: ఇతర రాష్ట్రాలలో ఆకస్మిక పర్యటనలు చేయొద్దు.. సీఎంలకు కేంద్రం ఆదేశాలు!

  • అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ
  • ముందస్తు సమాచారం లేకుండా రాష్ట్రం దాటొద్దని సూచన
  • భద్రతా పరమైన సమస్యలు పొంచి ఉన్నాయని హెచ్చరిక

ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలు చేయవద్దంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కొందరు ముఖ్యమంత్రులు ఎటువంటి సమాచారం లేకుండానే ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని, దీనివల్ల భద్రతాపరమైన సమస్యలు పొంచి ఉండే ప్రమాదం ఉందంటూ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది.

ముందస్తు సమాచారం లేకుండా ఆయా రాష్ట్రాల్లో పర్యటించడం వల్ల వారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇకపై ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరింది. అలా చేయడం వల్ల ఆయా రాష్ట్రాలు జడ్‌ ప్లస్ భద్రతను కల్పిస్తాయని పేర్కొంది. అలాగే వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తాయని వివరించింది.

Rajnath singh
CM
MHA
  • Loading...

More Telugu News