: శంకర్ రావు అరెస్టుపై సీఎమ్ కి ఫిర్యాదు: దానం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావును అరెస్ట్ చేసిన తీరుపై రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక ప్రజా ప్రతినిధిని అలా ఈడ్చుకెళ్ళడం దారుణం అన్నారు. భూ వివాదం కేసులో అలా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని దానం ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేసానని, బాధ్యులైన పోలీసులపై తప్పకుండా చర్యలు ఉంటాయనీ ఆయన అన్నారు.