Rajinikanth: ఇకపై ప్రతి ఎన్నికలో మన సైన్యం ఉంటుంది: రజనీ

  • పత్యామ్నాయాన్ని తీసుకురావడమే లక్ష్యం
  • త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలకు దూరం
  • అభిమానులకు ధన్యవాదాలు

అభిమానుల కేరింతల మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించారు. 21 ఏళ్ల ఎదురుచూపుకు ముగింపు పలికారు. 1996 నుంచి రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులతో సమావేశం సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఎవర్నీ విమర్శించడం తమ అభిమతం కాదని, ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.

తమ పార్టీకి మంచి కేడర్, వాచ్ డాగ్స్ కావాలని తెలిపారు. పార్టీకి సంబంధించిన కార్యాచరణను, విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. ఇకపై ప్రతి ఎన్నికలో తమ సైన్యం ఉంటుందని, అయితే త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలకు మాత్రం తమ పార్టీ దూరంగా ఉంటుందని... సమయం చాలా తక్కువ ఉండటంతో, పార్టీని సమాయత్తం చేయడం కష్టమవుతుందని ఆయన చెప్పారు. గత 6 రోజులుగా తన ప్రకటన కోసం ఎదురు చూస్తున్న అభిమానులందరికీ రజనీ ధన్యవాదాలు తెలిపారు. రజనీ పొలిటికల్ అనౌన్స్ మెంట్ తో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. 

  • Loading...

More Telugu News