Ram Nath Kovind: మన దేశంలో మానసిక అనారోగ్యం అంటువ్యాధిలా మారే పరిస్థితి ఉంది: రాష్ట్రపతి

  • మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది
  • 2022 నాటికి వీరి సంఖ్య భారీగా పెరగనుంది
  • అవసరమైన వైద్య వసతులను సమకూర్చుకోవాలి

మానసిక అనారోగ్యం మన దేశంలో పెద్ద సమస్యగా అవతరించిందని... అది అంటువ్యాధిలా పరిణమించే అవకాశం ఉందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. 2002 నాటికి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన వైద్య వసతులను సమకూర్చుకోవాలని ఆయన అన్నారు.

నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ 22వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు సూచించారు. గతంలో మానసిక నిపుణులు అందించిన దానికన్నా ఎక్కువ సేవలను ఇప్పుడు డిగ్రీ సర్టిపికేట్లు అందుకున్నవారు అందించాల్సి ఉందని కోవింద్ అన్నారు. ఆర్థిక, సాంకేతిక, జనాభా పరంగా వస్తున్న మార్పులు కూడా మానసిక అనారోగ్యానికి కారణమవుతున్నాయని ఆయన చెప్పారు. 2022 నాటికి వీరి సంఖ్య భారీగా పెరగబోతోందని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News