Hyderabad: హైదరాబాద్ యువతకు మెట్రో తీపి కబురు.. నేటి అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

  • కొత్త  సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న యువత
  • అర్ధరాత్రి వరకు సేవలను పొడిగించిన మెట్రో అధికారులు
  • ఆదివారం కావడంతో ఉదయం నుంచే యువత బిజీబిజీ

కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలా? వద్దా? అనే చర్చలు జరుగుతుండగానే యువత మాత్రం వారి వారి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. న్యూ ఇయర్ జోష్‌లో ఊగిపోయేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు వారంతా చూస్తున్నది ఎప్పుడు చీకటి పడుతుందనే! దీనికితోడు నేడు ఆదివారం కలిసి రావడంతో ఇప్పటి నుంచే సంబరాల కోసం ‘ఏర్పాట్లు’ చేసుకుంటున్నారు.

అర్ధ రాత్రి వరకు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని ఇంటికెళ్లే వారు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో తన సేవలను  పొడిగించింది. నేటి అర్ధరాత్రి దాటాక రెండు గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. సాధారణ సమయాల్లో ఉదయం 5 నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే నడిచే రైళ్ల సమయాన్ని ఆదివారం పొడిగించినట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Hyderabad
Metro Rail
New Year
Celebrations
  • Loading...

More Telugu News