triple talak: తలాక్ చెప్పొద్దు.. మీరు ప్రధాని అవుతారు!: ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆల్కా వ్యంగ్యాస్త్రం

  • మోదీపై పరోక్ష విమర్శలు
  • తలాక్ చెప్పి జైలుకు వెళ్లొద్దు
  • సైలెంట్ గా ఉంటే ప్రైమ్ మినిష్టర్ అవుతారు

ముస్లింల నిరసనలు, అడ్డంకులు, నిరసనల మధ్య ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. ఈ బిల్లు పట్ల ఎన్డీయేతర పార్టీల నేతల నుంచి ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆల్కా లంబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ, ట్విట్టర్ ద్వారా పరోక్ష విమర్శలు గుప్పించారు.

"తలాక్ చెప్పి ఎందుకు అనవసరంగా జైలుకు వెళ్తారు? మీ భార్యకు తలాక్ చెప్పకుండా కామ్ గా ఉంటే... భారతదేశానికి మీరు ప్రధానమంత్రి అవుతారు" అంటూ కామెంట్ చేశారు. ఈమె వ్యాఖ్యలపై బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు.

triple talak
alka lamba
Narendra Modi
  • Error fetching data: Network response was not ok

More Telugu News