bhuma akhila priya: అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య చిచ్చుపెట్టిన డిన్నర్ పార్టీ!

  • ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డి డిన్నర్ పార్టీ
  • తనకు తెలియకుండా ఎలా నిర్వహిస్తారంటూ అఖిల ఆగ్రహం
  • కర్నూలు టీడీపీలో వివాదం

కర్నూలు జిల్లా టీడీపీలో వేడి రాజుకుంది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీనికంతటికీ కారణం రేపు ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీనే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఏవీ సుబ్బారెడ్డి 31వ తేదీన ఆళ్లగడ్డలోని ఓ ఫంక్షన్ హాల్ లో డిన్నర్ ఏర్పాటు చేశారు. పార్టీకి హాజరుకావాలంటూ నంద్యాల, ఆళ్లగడ్డ నేతలను ఆయన స్వయంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంపై మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తనకు తెలియకుండానే ఆళ్లగడ్డలో డిన్నర్ ఇవ్వడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డిన్నర్ పార్టీకి ఎవరూ వెళ్లవెద్దంటూ పార్టీ నేతలకు సూచించారు. అయినప్పటికీ ఏవీ సుబ్బారెడ్డి తగ్గలేదు. తన బలం నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. రెండు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా తన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత పోరు ఇప్పుడు కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

bhuma akhila priya
av subbareddy
allagadda dinner parry
Telugudesam
  • Loading...

More Telugu News