TTV Dinakaran: దినకరన్ కు జై కొట్టిన 18 మంది ఎమ్మెల్యేలు.. ప్రమాణ స్వీకారానికి హాజరు!

  • ఆర్కే నగర్ నుంచి ఘన విజయం సాధించిన దినకరన్
  • అట్టహాసంగా ప్రమాణ స్వీకారం
  • హారతులిస్తూ స్వాగతం పలికిన మహిళలు

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడి ఘనవిజయం సాధించిన శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరుగగా, 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు హాజరై, తామంతా దినకరన్ వెంట నడవనున్నామన్న సంకేతాలు ఇచ్చారు. దినకరన్ చేత స్పీకర్ ధనపాల్ ప్రమాణం చేయించగా, మొత్తం 18 మంది ఎమ్మెల్యేలతో పాటు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

దినకరన్ నివాసం నుంచి సెక్రటేరియేట్ వరకూ ఘనస్వాగతం లభించింది. ఎంపీ శశికళా పుష్ప, తిరుచ్చి చారుబాల తొండమాన్ వంటి నేతలు ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు దినకరన్ కు హారతులు పట్టారు. తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వం మూడు నెలలు మాత్రమే ఉంటుందని దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని డీఎంకే ప్రకటించింది.

TTV Dinakaran
Tamilnadu
Chennai
AIADMK
  • Loading...

More Telugu News