ashakumari: ఆ కానిస్టేబుల్ నన్ను తిట్టి, తోసేసినందుకే చేయిచేసుకున్నాను.. సారీ!: హిమాచల్ ఎమ్మెల్యే ఆశాకుమారి
- హిమాచల్ ప్రదేశ్లో రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న సమీక్ష ప్రాంగణంలో ఘటన
- పరస్పరం కొట్టుకున్న ఎమ్మెల్యే ఆశా కుమారి, మహిళా కానిస్టేబుల్
- ఆ కానిస్టేబుల్ తల్లికి ఎంత వయసు ఉంటుందో నాకూ అంతే వయసు ఉంటుంది
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తోన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు ఆశాకుమారి తనను అడ్డుకున్నందుకుగానూ ఓ మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. ఈ వెంటనే ఆ మహిళా కానిస్టేబుల్ కూడా సదరు ఎమ్మెల్యేను కొట్టారు. తన ప్రవర్తనపై ఆశాకుమారి స్పందిస్తూ... ఆ మహిళా కానిస్టేబుల్ తనను తిట్టారని అన్నారు. తనను వెనక్కి తోసిసి, ముందుకు వెళ్లకుండా అడ్డుకుందని ఎమ్మెల్యే అన్నారు.
ఆ కానిస్టేబుల్ తల్లికి ఎంత వయసు ఉంటుందో తనకు కూడా అంతే వయసు ఉంటుందని, అయినప్పటికీ ఆమె తోసేశారని తెలిపారు. అయితే, తాను ఆ సమయంలో సహనాన్ని కోల్పోకుండా అదుపులో పెట్టుకోవాల్సి ఉండాల్సిందని అన్నారు. తన ప్రవర్తన పట్ల క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.