Congress: మేఘాలయలో ‘కాంగ్రెస్’కు ఎదురుదెబ్బ! ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా!
- మరో రెండు నెలల్లో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు
- ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా
- మేఘాలయ అసెంబ్లీలో 24కు పడిపోయిన ‘కాంగ్రెస్’ బలం
మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలనుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. మొత్తం 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 30 మంది సభ్యులు ఉన్నారు.
తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో ‘కాంగ్రెస్’ బలం 24కు పడిపోయింది. కాగా, ఇద్దరు ఇండిపెండెంట్ లు, యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా తమ పదవులకు రాజీనామా సమర్పించారు. మరో రెండు నెలల్లో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది.