Chandrababu: ట్రిపుల్ తలాక్ పై టీడీపీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు: సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

  • ట్రిపుల్ తలాక్ బిల్లుకు ప్రతిఒక్కరూ మద్దతిస్తున్నారు
  • ఈ బిల్లుపై అభిప్రాయాలు సేకరించాం
  • ముస్లిం పురుషులు 44 శాతం, మహిళలు 56 శాతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు: చంద్రబాబు

ట్రిపుల్ తలాక్ పై టీడీపీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ‘జన్మభూమి’పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐదో విడత ‘జన్మభూమి’ గురించిన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోక్ సభలో నిన్న ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లు గురించి ఆయన ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ప్రతిఒక్కరూ మద్దతిస్తున్నారని, ఈ బిల్లుపై అభిప్రాయాలు సేకరించామని చెప్పారు. ముస్లిం పురుషులు 44 శాతం, మహిళలు 56 శాతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News