: కోలుకున్న సోనూ సూద్
సీసీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన టాలీవుడ్ ప్రతినాయకుడు సోనూ సూద్ కోలుకున్నాడు. దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో గాయపడడంతో సోనూ రెండు నెలలు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. తాజాగా, 'షూటౌట్ ఎట్ వడాలా' చిత్రం విజయోత్సవసభలో దర్శనమిచ్చాడు. గాయం తర్వాత సోనూ ఇంటి నుంచి వెలుపలికి రావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ, ప్రస్తుతం తన తొలి ఫ్రాధాన్యత 'జంజీర్' చిత్రం పూర్తి చేయడమే అని తెలిపాడు. సోనూకు గాయం కావడంతో ఆయన నటించాల్సి ఉన్న పలు చిత్రాలు ఆలస్యం అయ్యాయి. త్వరలోనే అవన్నీ పూర్తి చేస్తానని సోనూ చెప్పాడు.