Vijayawada: డిసెంబర్ 31న విజయవాడలో పలు ఆంక్షలు.. బేఖాతరు చేస్తే తాటతీస్తామన్న పోలీసులు

  • డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాం
  • బైక్ ర్యాలీలు వద్దు
  • పేకాట, కోడిపందేల జోలికెళ్తే తాట తీస్తాం

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ నెల 31న విజయవాడలో పలు ఆంక్షలను విధించారు పోలీసులు. 31వ తేదీ రాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని డీసీపీలు కాంతిరాణా, గుజరావ్ భూపాల్ రావులు తెలిపారు. రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ట్రిపుల్ రైడింగ్, హైస్పీడ్ డ్రైవింగ్ చేయవద్దని ద్విచక్ర వాహనదారులను హెచ్చరించారు.

 నగరంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని, వేడుకలను నిర్వహించేవారు పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఆసుపత్రుల సమీపంలో వేడుకలు నిర్వహించరాదని చెప్పారు. పేకాట, కోడిపందేలను నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Vijayawada
new year celebrations in vijayawada
vijayawada police warning
  • Loading...

More Telugu News