BJP: విభజన సమయంలో ఏపీకి ఏం కావాలో ఒక్క టీడీపీ నేతా అడగలేదు: సోము వీర్రాజు విమర్శలు
- ఏపీకి ఫలానావి కావాలని మాట్లాడింది ఒక్క వెంకయ్యనాయుడే
- పార్టీ బలపడుతున్న ప్రతిసారి ప్రత్యేకహోదాను తెరపైకి తెస్తున్నారు
- మిగిలిన ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోరే?: సోము వీర్రాజు
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఏం కావాలనే విషయాన్ని ఒక్క టీడీపీ నేతా అడగలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన సమయంలో ఏపీకి ఫలానావి కావాలని మాట్లాడింది ఒక్క వెంకయ్యనాయుడేనని, టీడీపీ ఎంపీలు మాత్రం నోటికి గుడ్డలు కట్టుకుని ప్లకార్డులు ప్రదర్శించారని విమర్శించారు.
ఏపీలో తమ పార్టీ బలపడుతున్న ప్రతిసారి ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదు, ప్యాకేజ్ కావాలని చంద్రబాబు అన్న విషయాన్ని ప్రస్తావించారు. సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్న చంద్రబాబు, రాష్టంలోని మిగిలిన ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు.