asaduddin owaisi: లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

  • ట్రిపుల్ త‌లాక్‌ను నిరోధించే ఈ బిల్లు ముస్లింల‌కు న్యాయం చేయ‌దు
  • అంతేగాక, మరింత అన్యాయం జరుగుతుంది- అసదుద్దీన్
  • ఈ బిల్లు రాజ్య‌స‌భ‌లోనూ పాస్ అవుతుంది-రాజ్‌నాథ్‌ సింగ్

ముస్లిం మ‌హిళ‌ల జీవితాలను రోడ్డున ప‌డేస్తోన్న ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును విస్తృత చర్చ తరువాత‌ మూజువాణి ఓటుతో లోక్‌స‌భ ఆమోదించిన విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ‌లో ఈ బిల్లును తీవ్రంగా వ్య‌తిరేకించిన హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత‌ అస‌దుద్దీన్ ఒవైసీ.. ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఉల్లంఘించేలా ఈ బిల్ ఉంద‌ని అన్నారు. లోక్‌స‌భ వాయిదా ప‌డిన అనంత‌రం అస‌దుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ... ట్రిపుల్ త‌లాక్‌ను నిరోధించే ఈ బిల్లు ముస్లింల‌కు న్యాయం చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అంతేగాక‌, ముస్లిం మ‌హిళ‌ల‌కు మ‌రింత అన్యాయం జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించారు.

కాగా, ట్రిపుల్ త‌లాక్ బిల్లు లోక్‌స‌భ‌లో ఆమోదించిన అంశంపై మాట్లాడిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ రోజు ఒక చారిత్రాత్మ‌క దినం అని అన్నారు. ఈ బిల్లు రాజ్య‌స‌భ‌లోనూ పాస్ అవుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.       

  • Loading...

More Telugu News