loksabha: వీగిపోయిన విపక్షాల సవరణలు.. ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

  • మూజువాణి ఓటుతో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం
  • ఒవైసీ సూచించిన సవరణలకు మద్దతుగా 2, వ్యతిరేకంగా 239 ఓట్లు
  • రాజ్యసభకు వెళ్లనున్న ట్రిపుల్ తలాక్ బిల్లు

లోక్ సభలో ట్రిపుల్ తలాక్ ను నిరోధించే బిల్లుపై విపక్షాల సవరణలు వీగిపోయాయి. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఇతరులు సూచించిన సవరణ ప్రతిపాదనలపై ఓటింగ్ నిర్వహించారు. ఒవైసీకి మద్దతుగా 2, వ్యతిరేకంగా 241 మంది సభ్యులు ఓట్లు వేశారు. దీంతో, మూజువాణి ఓటుతో ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కాగా, ఈ బిల్లును ఎంఐఎం, అన్నాడీఎంకే, బీజేడీ, ఆర్జేడీ, ముస్లింలీగ్ వ్యతిరేకించాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుకి ఒక్క సవరణ కూడా లేకుండా ఆమోదం లభించింది. దీంతో ఇక ఈ బిల్లు రాజ్యసభకి వెళ్లనుంది.

loksabha
triple talaq
  • Loading...

More Telugu News