allu shirish: 'జీవ' పాత్రలో మంచి మార్కులు కొట్టేసిన అల్లు శిరీష్!

  • అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
  • ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు 
  • అల్లు శిరీష్ నటనకు ప్రశంసలు    

'గౌరవం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన అల్లు శిరీష్, 'శ్రీరస్తు శుభమస్తు'తో సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తరువాత మంచి కథ కోసం వెయిట్ చూస్తూ కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, 'ఒక్క క్షణం' సినిమాతో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ఆయన 'జీవ' పాత్రను పోషించాడు. ఈ సినిమా చూసిన వాళ్లు కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని అంటున్నారు.

 శిరీష్ కి చాలా డిఫరెంట్ రోల్ పడిందనీ, ఆయన ఆ పాత్రలో చాలా చక్కగా నటించాడని అంటున్నారు. గతంలో చేసిన సినిమాలతో పోల్చుకుంటే, నటనలో ఆయన చాలా పరిణతిని కనబరిచాడని చెబుతున్నారు. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లోను ఆయన చాలా బాగా నటించాడని అంటున్నారు. బాడీ లాంగ్వేజ్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా ఆయన కొత్తదనాన్ని చూపాడని చెబుతున్నారు. ఈ సినిమాతో ఆయన ఖాతాలోకి మరో హిట్ చేరుతుందేమో చూడాలి.     

allu shirish
surabhi
  • Loading...

More Telugu News