video: నదిలో.. మంచు గడ్డల మధ్య ఇరుక్కుపోయిన వృద్ధురాలిని కాపాడిన వ్య‌క్తి... వీడియో వైర‌ల్‌!

  • నీరు గడ్డక‌ట్టుకు పోయిన న‌ది
  • మంచు గ‌డ్డ‌ల‌ను ప‌గుల‌కొట్టి కాపాడిన వైనం
  • చైనాలో ఘ‌ట‌న‌

ఉష్ణోగ్ర‌త‌లు అతి త‌క్కువ‌గా ఉండ‌డంతో గడ్డక‌ట్టుకు పోయిన ఓ న‌దిలో ఓ వృద్ధురాలు ప్ర‌మాద‌వ‌శాత్తూ ఇరుక్కుపోయింది. అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన ఓ వ్య‌క్తి ఆమె చుట్టూ వున్న మంచు గ‌డ్డ‌ల‌ను ప‌గుల‌కొట్టి ఆమెను కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. 54 ఏళ్ల షిలెయ్ అనే స‌ద‌రు వ్య‌క్తి స‌మ‌యానికి అక్క‌డ‌కు రాక‌పోయి ఉంటే 70 ఏళ్ల ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పేయేది. ఆమెను బ‌య‌ట‌కు లాక్కురావ‌డానికి షిలెయ్‌కు మ‌రో వ్య‌క్తి కూడా సాయం చేశాడు. చైనాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను మీరూ చూడండి...

  • Loading...

More Telugu News