tim cook: ఇక నుంచి టిమ్ కుక్ ప్ర‌యాణం ప్రైవేట్ జెట్‌లోనే!

  • అంగీకారం తెలిపిన ఆపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్లు
  • వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు కూడా
  • భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా నిర్ణ‌యం

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇక నుంచి ప్రైవేట్ జెట్‌లోనే ప్ర‌యాణించనున్నారు. వృత్తిగ‌త‌, వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు కూడా ఆయ‌న ప్రైవేట్ జెట్‌లోనే వెళ్లాల‌నే నిర్ణ‌యానికి ఆపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్లు ఆమోదం తెలిపారు. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా సీఈఓకి ప్ర‌త్యేక ర‌క్ష‌ణ క‌ల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అంత‌ర్జాతీయంగా టిమ్ పేరు అంద‌రికీ తెలియ‌డం, ఎక్కువ‌గా స‌మావేశాల‌కు హాజ‌రవుతున్న నేప‌థ్యంలో ఇలాంటి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన పాల‌సీని ఆపిల్ అభివృద్ధి చేసిన‌ట్లు తెలుస్తోంది.

2017లో టిమ్ కుక్ 12.8 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించారు. ఇందులో 3.06 మిలియన్ డాల‌ర్లు వేత‌నంగా పొంద‌గా, 9.3 మిలియ‌న్ డాల‌ర్లు బోన‌స్‌గా పొందిన‌ట్లు టెలిగ్రాఫ్ ప‌త్రిక ప్ర‌చురించింది. 2017లో ఆయ‌న వ్య‌క్తిగ‌త ప్రయాణ ఖ‌ర్చుగా ఆపిల్ 93,109 డాల‌ర్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. కేవ‌లం టిమ్ కుక్ కోసం ప్రత్యేకంగా ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీ స‌ర్వీసెస్‌ను ఆపిల్ నియ‌మించింది.

  • Loading...

More Telugu News