ola smart rider app: మందు బాబుల కోసం సరికొత్త స్మార్ట్ రైడర్ యాప్!
- స్మార్ట్ రైడర్ యాప్ సిద్ధం
- బార్లు, పబ్ లతో ఓలా కనెక్టివిటీ
- మందు తాగి క్షేమంగా ఇంటికి చేరాలన్నదే లక్ష్యం
డ్రంకెన్ డ్రైవ్ ను అరికట్టాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వంతో కలసి ఓలా మిషన్ స్మార్ట్ రైడ్ సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని బార్లు, పబ్ లతో ఓలాను అనుసంధానం చేస్తూ స్మార్ట్ రైడర్ యాప్ ను రెడీ చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమంలో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సినీ నటుడు అలీ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ ను రూపొందించినట్టు ఈ సందర్భంగా వక్తలు తెలిపారు. బారులో ఎంత తాగినా, ఈ యాప్ ద్వారా వెయిటరే ఓలా క్యాబ్ ను బుక్ చేసి మద్యం తాగిన వ్యక్తిని సురక్షితంగా అతని ఇంటి వద్ద డ్రాప్ చేసేలా యాప్ ను రూపొందించారు. నటుడు అలీ మాట్లాడుతూ, 2017లో చాలా ప్రమాదాలు జరిగాయని... అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ యాప్ ను రూపొందించినట్టు తెలిపారు.