everest: ఎవరెస్ట్‌పైనా చైనా రాజకీయం.. భారత్ ప్రతిపాదనలను తిరస్కరించిన నేపాల్!
- నేపాల్ తో కలసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు ప్రతిపాదించిన భారత్
- తామే కొలుస్తామన్న నేపాల్
- 2015 భూకంపంతో ఎవరెస్ట్ ఎత్తుపై అనుమానాలు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా విరాజిల్లుతున్న ఎవరెస్ట్ ఎత్తును మళ్లీ కొలిచేందుకు భారత్ సిద్ధమైంది. నేపాల్ తో కలసి సంయుక్తంగా ఈ పనిని నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ ప్రతిపాదనలను నేపాల్ తిరస్కరించింది. ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని... భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ జనరల్ గణేష్ భట్టా తెలిపారు. అయితే, తమ ప్రతిపాదనలను నేపాల్ తిరస్కరించడం వెనుక చైనా హస్తం ఉండవచ్చని భారత్ భావిస్తోంది.
2015లో 7.8 తీవ్రతతో నేపాల్ ను కుదిపేసిన భారీ భూకంపం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్ర నెలకొన్నాయి. దీంతో, నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలిసి ఎవరెస్ట్ ఎత్తును మరోసారి కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను నేపాల్ తిరస్కరించింది.