noor mohammad: బీజేపీలో చేరి.. అగ్రనాయకులను చంపాలనుకున్న ఉగ్రవాది నూరా!

  • బీజేపీ అగ్రనేతల హత్యలకు నూరా ప్లాన్
  • బీజేపీలో చేరేందుకు యత్నం
  • ఇంతలోనే అరెస్ట్

జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ నూర్ మహమ్మద్ తాంత్రే అలియాస్ చోటా నూరాను భద్రతాదళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఓ జాతీయ మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది. 2003లో బీజేపీలో చేరడానికి నూరా ప్రయత్నించాడని తన కథనంలో పేర్కొంది. బీజేపీలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీ అగ్రనేతలను చంపాలనేది నూరా ఉద్దేశమని తెలిపింది. కార్యకర్తగా తన పేరును నమోదు చేసుకునేందుకు దరఖాస్తు పత్రాన్ని కూడా తెచ్చుకున్నాడని పేర్కొంది. అయితే, అతని ప్లాన్ అమలు కాకముందే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపింది.

కేవలం మూడడుగుల ఎత్తు మాత్రమే ఉండే నూరా భద్రతాదళాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. 2015లో జైషే మొహమ్మద్ లో నూరా చేరాడు. ఆ తర్వాత కశ్మీర్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక అతని హస్తం ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News