Andhra Pradesh: ‘టెట్’ను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకే!
- జనవరి నుంచి ఫిబ్రవరికి వాయిదా పడిన పరీక్ష
- విద్యార్థుల అభ్యర్థన మేరకు మూడు వారాల వాయిదా
- హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులకు నిర్వహించ తలపెట్టిన టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేసింది. 14వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికంటే ముందు జనవరిలో ‘టెట్’ నిర్వహించాలని భావించింది. ఇందుకోసం ఏర్పాట్లను కూడా చేసింది.
అయితే పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం చాలా తక్కువగా ఉందన్న విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ‘టెట్’ను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో జనవరి 17న జరగాల్సిన పరీక్ష ఫిబ్రవరికి వాయిదా పడింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి పరీక్షను వాయిదా వేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.