ram gopal varma: రామ్ గోపాల్ వర్మను హెచ్చరించిన మంత్రి ఆదినారాయణరెడ్డి

  • ‘కడప’ పేరిట వెబ్ సిరీస్ తీయడం సబబు కాదు
  • ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి
  • మార్పులు చేయకపోతే ప్రజలే తగినబుద్ధి చెబుతారన్న మంత్రి

‘కడప’ పేరిట వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కడప’ పేరిట వెబ్ సిరీస్ తీయడం సబబు కాదని, ‘బెజవాడ’ సినిమాలో మార్పులు చేసిన విధంగానే ‘కడప’ వెబ్ సిరీస్ లో కూడా మార్పులు చేయాలని అన్నారు.

కడప ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఈ సిరీస్ లో మార్పులు చేయాలని, అలా చేయని పక్షంలో ప్రజలే తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. పోటీ నుంచి తప్పుకోవడం వైసీపీకి అవమానకరమని ఎద్దేవా చేశారు.

ram gopal varma
cuddapah
  • Loading...

More Telugu News