TRS: లోక్‌సభలో మరోసారి టీఆర్‌ఎస్ ఎంపీల నినాదాల హోరు.. స్పందించిన మంత్రి!
- హైకోర్టు విభజన చేయాలంటూ నినాదాలు
- సభా కార్యకలాపాలను అడ్డుకున్న ఎంపీలు
- రేపు లోక్‌సభలో వివరణ ఇస్తామన్న మంత్రి
రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు ముగిసినప్పటికీ హైకోర్టు విభజన చేయలేదంటూ ఈ రోజు ఉదయం లోక్‌సభలో నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి నినాదాలతో హోరెత్తించారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుతగలడంతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైకోర్టు ఏర్పాటుపై రేపు లోక్‌సభలో మాట్లాడి వివరణ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో గందరగోళం తగ్గింది.