Chandrababu: చంద్రబాబును ఆహ్వానించకపోవడం వల్ల కేసీఆర్ కు ఏదో బెనిఫిట్ ఉండి ఉంటుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

  • తెలుగు మహాసభలకు ఆహ్వానించనందు వల్ల నష్టమేమీ లేదని బాబు అనుకోవచ్చు
  • కేసీఆర్ కు ఎన్టీఆర్ పై కోపం ఉండాల్సిన అవసరమైతే లేదు
  • చంద్రబాబు బిజినెస్ అంతా  హైదరాబాద్ లోనే ఉంది
  • కేసీఆర్ బిజినెస్ లేవీ ఆంధ్రాలో లేవు: ఉండవల్లి విమర్శలు

ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబును ఆహ్వానించకపోవడం వల్ల కేసీఆర్ కు ఏదో బెనిఫిట్ ఉండి ఉంటుందని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనను ఆహ్వానించకపోవడం వల్ల పెద్ద నష్టమేమి లేదు, లాభమేనని చంద్రబాబు అనుకొని ఉండొచ్చని అన్నారు. చంద్రబాబు అలా అనుకోని పక్షంలో టీడీపీ నాయకులు ఈ మహాసభలకు వెళ్లకుండా బాయ్ కాట్ చేసి ఉండేవారని, ఏపీ టీడీపీ నేతల్లో డైరెక్టుగా బాలకృష్ణే హాజరయ్యారు కదా? అని ఆయన అన్నారు.

 ‘కేసీఆర్ ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే చంద్రబాబు వెళతాడు, అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లి అక్కడ ప్రసంగించారు. తెలంగాణకు పక్కనే ఉన్న అతిపెద్ద తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించకపోయినా తెలుగుదేశం పార్టీ వాళ్లు, సినిమా యాక్టర్లు అందరూ వెళ్లారు. తెలుగు మహాసభలకు చంద్రబాబును ఎందుకు పిలవలేదనే విషయం నాకైతే అర్థం కాలేదు! చంద్రబాబును పిలవకుండా తెలుగుమహాసభలేంటి! తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ పేరు కూడా స్మరించుకోలేదు.

‘తెలుగు’ వ్యవహారం వస్తే ఎన్టీఆర్ పేరును స్మరించుకోవాలి కదా! ఎన్టీఆర్ కళాకారుడే కాకుండా, పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చి అధికారం కూడా ఆయన చేపట్టారు. తెలుగుమహాసభల్లో ఎన్టీఆర్ చిత్రపటాన్ని తప్పకుండా పెట్టాలి. కేసీఆర్ కు చంద్రబాబుపై రాజకీయమున్నా, ఎన్టీఆర్ పై కోపం ఉండాల్సిన అవసరమైతే లేదు. చంద్రబాబును ఆహ్వానించకపోవడం వల్ల కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనమేదో ఉండి ఉంటుంది! లేకపోతే, ఇలా చెయ్యడు. ఏ ప్రయోజనాలు ఆశించి కేసీఆర్ ఈవిధంగా చేశారో! చంద్రబాబునాయుడి బిజినెస్ అంతా  హైదరాబాద్ లోనే ఉంది. కేసీఆర్ బిజినెస్ లేవీ ఆంధ్రాలో లేవు. ఇదంతా వ్యాపారం.. వ్యాపార ప్రయోజనాలు. రాజకీయంగా అధికారంలోకి రావడం కూడా ఒక వ్యాపారమే’ అని ఉండవల్లి విమర్శించారు.

  • Loading...

More Telugu News