mohammed kaif: మరోసారి మత ఛాందసవాదుల ఆగ్రహానికి గురైన మహమ్మద్ కైఫ్

  • కుటుంబంతో కలసి క్రిస్మస్ జరుపుకున్న కైఫ్
  • ఫొటో ట్విట్టర్లో అప్ లోడ్
  • ముస్లింవేనా అంటూ ఛాందసవాదుల మండిపాటు

మత ఛాందసవాదులకు టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మరోసారి టార్గెట్ అయ్యాడు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తన కుటుంబంతో కలసి ఇంటిలో సంబరాలు చేసుకున్న ఫొటోను కైఫ్ ట్విట్టర్ ద్వారా అప్ లోడ్ చేశాడు. 'మెర్రీ క్రిస్మస్. ప్రేమ, శాంతితో జీవించండి' అంటూ కామెంట్ పెట్టాడు.

దీంతో, ఆయనపై ఛాందసవాదులు విరుచుకుపడ్డారు. విమర్శలకు తెరతీశారు. ముస్లిం అయిన కైఫ్ క్రైస్తవ మతం స్వీకరించాడంటూ కొందరు మండిపడ్డారు. ముస్లింగా ఉండి క్రిస్మస్ జరుపుకోవడం మహా పాపమంటూ కొందరు వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఛాందసవాదుల ఆగ్రహానికి కైఫ్ గురైన సంఘటనలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు చేసినందుకు, చెస్ ఆడినందుకు, ట్రిపుల్ తలాఖ్ పై సుప్రీంకోర్టు తీర్పును సమర్థించినందుకు కైఫ్ పై విరుచుకుపడ్డారు ఛాందసవాదులు. 

mohammed kaif
kaif cristmas
kaif trolled in social media
  • Loading...

More Telugu News