YSRCP: మాపై కేసు పెడతామన్నవారిని నాడు వైఎస్ మందలించారు: కందుల రాజమోహన్ రెడ్డి

  • రాజారెడ్డి హత్య కేసును ప్రస్తావించిన కందుల
  • మేము ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటామని వైఎస్ కు తెలుసు
  • రాజకీయంగా కొట్లాడుకున్నా..మా కుటుంబంపై వైఎస్ కు అభిమానం ఉంది: కందుల రాజమోహన్ రెడ్డి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో తమ ప్రమేయం లేదనే విషయం అందరికీ తెలిసిందేనని కందుల రాజమోహన్ రెడ్డి అన్నారు. '1996లో నేను టీడీపీ తరపున ఎంపీ గా నిలబడ్డాను. ఆ సమయంలో పులివెందుల టౌన్ లో టీడీపీ ఆఫీసు పెట్టడానికి ఎవరూ సాహసం చేయని పరిస్థితి వుంది. ఆరోజున పులివెందుల టౌన్ లో నేను ఒక బిల్డింగ్ కొని, అందులో టీడీపీ ఆఫీసు స్థాపించాను. అక్కడ స్థానికంగా ఉండే అడ్వకేట్ పేర్ల పార్థసారథిరెడ్డి కుటుంబం మాకు మద్దతుగా నిలిచింది.

1996లో ఎన్నికలు అయిన అనంతరం, పార్థసారధిరెడ్డిపై రాజారెడ్డి మనుషులు దాడి చేశారు. దాదాపు పార్థసారథిరెడ్డి చనిపోయేంతగా కొట్టారు. అతన్ని మద్రాసులో ఓ ఆసుపత్రికి తరలించి.. కోలుకునేలా చేసి.. తిరిగి పులివెందులకు వచ్చేలా చేశాం. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పేర్ల పార్థసారథిరెడ్డి కుటుంబం మాకు మద్దతుగా నిలిచింది. అయితే, మళ్లీ దాడి చేసేందుకు రాజారెడ్డి తన మనుషులతో ప్రయత్నిస్తున్నారనే సమాచారం పార్థసారథి తరపు వారికి తెలిసిందని అంటారు.

దీంతో, బహిరంగంగా పట్టపగలు రాజారెడ్డిపై దాడి చేసి హత్య చేశారు. అందువల్ల, దీంట్లో దాపరికం లేదు, ఓపెన్ గా జరిగిన విషయాలు. రాజకీయంగా మేము ఎంతగా కొట్లాడుకున్నా కూడా మా కుటుంబంపై రాజశేఖర్ రెడ్డిగారికి మొదటి నుంచి మంచి అభిమానం ఉంది. కడప జిల్లాలో రాజకీయాలు చేస్తూ, ఫ్యాక్షన్ కు దూరంగా ఉండటానికి కారణం మా మైండ్ సెట్ అలాంటిది. ఈ విషయం రాజశేఖర్ రెడ్డిగారికి తెలుసు కాబట్టి, తన తండ్రి హత్య కేసులో మాపై ఎలాంటి కేసులు పెట్టలేదు. వాస్తవానికి, మాపై కేసు పెట్టాలని రాజశేఖర్ రెడ్డి మనుషులందరూ చూశారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్లను మందలించారు’ అని చెప్పుకొచ్చారు రాజమోహన్ రెడ్డి.

  • Loading...

More Telugu News