Pawan Kalyan: పవన్ కల్యాణ్ చాలా మంచి వ్యక్తని మా తల్లిదండ్రులు చెప్పేవాళ్లు: భూమా అఖిలప్రియ

  • అప్పుడు ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ రావాల్సి ఉంది
  • భూమా నాగిరెడ్డి రావద్దని రిక్వెస్ట్ చేయడంతో పవన్ రాలేదు
  • ఓ ఇంటర్వ్యూలో అఖిలప్రియ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా మంచి వ్యక్తని తన తల్లిదండ్రులు తమతో చెబుతుండేవారని ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిపై పవన్ కల్యాణ్ కు చాలా అభిమానం. ‘పవన్ కల్యాణ్ చాలా సాధారణంగా ఉంటారు .. చాలా మంచి వ్యక్తి’ అని భూమా నాగిరెడ్డి గారు పీఆర్పీలో ఉన్నప్పుడు ఎప్పుడూ చెబుతుండేవారు.

శోభానాగిరెడ్డి గారు చనిపోవడానికి ముందు ఇక్కడ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ రావాల్సి ఉంది. అయితే, భూమా నాగిరెడ్డిగారు రావద్దని పవన్ కల్యాణ్ ని రిక్వెస్ట్ చేయడంతో ఆయన రాలేదు. మా ఫ్యామిలీపై పవన్ కు చాలా గౌరవం ఉంది. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి గెలవడానికి కారణం తానేనని పవన్ కల్యాణ్ చెప్పినట్టు నేనెక్కడా వినలేదు. అయితే, పవన్ కల్యాణ్ బ్లెసింగ్స్ అయితే కచ్చితంగా మాకు ఉన్నాయి’ అని అఖిలప్రియ చెప్పారు.

Pawan Kalyan
prp
  • Loading...

More Telugu News