charan: సంక్రాంతికి 'రంగస్థలం' టీజర్ రిలీజ్!

  • 'రంగస్థలం' ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ 
  • టీజర్ రిలీజ్ కి సన్నాహాలు 
  • మార్చి 30న ప్రేక్షకుల ముందుకు  

'రంగస్థలం' సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో టీజర్ ను ఎప్పుడు వదులుతారా అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సంక్రాంతికి టీజర్ ను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.

 నిజానికి ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడంతో, అభిమానులు నిరుత్సాహపడకూడదన్న ఉద్దేశంతో టీజర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. జగపతిబాబు కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను, మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారు.  

  • Loading...

More Telugu News