komati reddy venkat reddy: త్వరలోనే నా కల నెరవేరబోతోంది: కోమటిరెడ్డి

  • ఉదయసముద్రం పనులపై కోమటిరెడ్డి హర్షం
  • హరీష్ కు ధన్యవాదాలు
  • ఇచ్చిన మాటను కేసీఆర్ నిలుపుకున్నారు

తన స్వగ్రామమైన బ్రాహ్మణ వెల్లంలలో జరుగుతున్న ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు పట్ల ఆయన ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టు పనులు పూర్తి కాబోతున్న తరుణంలో... తన కల నెరవేరబోతోందని అన్నారు.

2018లో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారని... ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే నాగార్జునసాగర్ ఆయకట్టు మాదిరి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

komati reddy venkat reddy
udaya samudram project
Harish Rao
KCR
  • Loading...

More Telugu News