Telugudesam: ఆ పదవి గురించి మర్చిపోవడమే నా ఆరోగ్యానికి మంచిది: మోత్కుపల్లి
- గవర్నర్ పదవి కోసం మూడేళ్లుగా ఎదురుచూశా
- దానిపై ఆశలు దాదాపు వదులుకున్నట్టే
- చంద్రబాబు ఎంతో కృషి చేసినా ఫలితం దక్కలేదు
టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును ఎప్పటి నుంచో ఊరిస్తున్న పదవి ‘గవర్నర్’. రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం, మార్పులు చేర్పులు జరిగిన ప్రతిసారి, ప్రముఖంగా వినబడుతున్న పేరు మోత్కుపల్లిదే. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ పదవి తనకు దక్కకపోవడంపై మోత్కుపల్లి స్పందిస్తూ, ఆ పదవి కోసం మూడేళ్లుగా ఎదురుచూశానని, ఇక ఇప్పుడు దాని గురించి ఆలోచించడమే మానేశానని అన్నారు.
ఆ పదవి గురించి మర్చిపోవడమే తన ఆరోగ్యానికి మంచిదని, దానిపై ఆశలు దాదాపు వదులుకున్నట్టేనని మోత్కుపల్లి వ్యాఖ్యానించడం గమనార్హం. తనను గవర్నర్ చేయాలనే ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిదేనని, తనకు ఆ పదవి ఇప్పించేందుకు ఆయన ఎంతో కృషి చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయిందని అన్నారు.