bengal: ప్రముఖ బెంగాలీ నటుడు పార్థ ముఖోపాధ్యాయ కన్నుమూత

  • కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు
  • కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి
  • సీఎం మమతా బెనర్జీ, పలువురు సినీ ప్రముఖుల సంతాపం

ప్రముఖ బెంగాలీ నటుడు పార్థ ముఖోపాధ్యాయ (70) ఈరోజు కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. పార్థ ముఖోపాధ్యాయ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

కాగా, 1958లో ‘మా’ సినిమాతో బాలనటుడిగా ఆయన చిత్రరంగంలోకి ప్రవేశించారు. దర్శకుడు తపన్ సిన్హా తెరకెక్కించిన ‘అతిథియా’ సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. బెంగాల్ సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్ కి తమ్ముడు, కొడుకు పాత్రల్లో ఎక్కువగా పార్థ ముఖోపాధ్యాయనే నాటి దర్శకులు ఎంపిక చేసేవారు. బాలిక బధూ, ధోన్యి మెయె, అగ్నిష్వర్, అమర్ పృథ్వీ, బాగ్ బందీ ఖేలా, పాపులర్ వంటి సినిమాల్లో ఆయన నటించారు. 

  • Loading...

More Telugu News