raviteja: రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ 'నేల టికెట్'!

  • రవితేజ తాజా చిత్రంగా 'టచ్ చేసి చూడు'
  • తదుపరి చిత్రం కల్యాణ్ కృష్ణతో 
  • తాజాగా టైటిల్ ఖరారు 
  • వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్

రవితేజ హీరోగా రూపొందిన 'టచ్ చేసి చూడు' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కల్యాణ్ కృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి ఆయన రెడీ అవుతున్నాడు. కథా పరంగా ఈ సినిమా కోసం వివిధ రకాల టైటిల్స్ ను పరిశీలించి, చివరికి 'నేల టికెట్'ను ఖరారు చేసినట్టు సమాచారం.

రవితేజకి మొదటి నుంచి కూడా మాస్ ఇమేజ్ ఎక్కువ. అందువలన ఈ టైటిల్ మాస్ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉందనే ఉద్దేశంతో ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమా, జనవరి రెండవ వారంలో రెగ్యులర్ షూటింగును మొదలెట్టనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే అంశాలతో ఈ కథను కల్యాణ్ కృష్ణ సిద్ధం చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.               

  • Loading...

More Telugu News