ileana: తన పెళ్లైపోయిందని చెప్పకనే చెప్పిన ఇలియానా!
- 'హబ్బీ' అంటూ ఫొటో పోస్ట్ చేసిన నటి
- ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్
- నిజంగానే పెళ్లైందా?
దేవదాసు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి, తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిన గోవా బ్యూటీ ఇలియానా రహస్యంగా పెళ్లి చేసుకుందనే పుకార్లు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. క్రిస్మస్ సందర్భంగా ఆమె పెట్టిన ఓ ఇన్స్టాగ్రాం పోస్టు ఈ అనుమానాలకు తావిస్తోంది. 'సంవత్సరంలో నాకు ఇష్టమైన సమయమిది. ఫొటో తీసింది హబ్బీ' అంటూ ఆమె ఓ ఫొటోను షేర్ చేసింది.
ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె చేసిన పోస్టులో ఆండ్రూని హబ్బీ అనడంతో తన పెళ్లి విషయాన్ని ఇలియానా చెప్పకనే చెప్పింది. వారి మధ్య రిలేషన్ గురించి ఇలియానా ఎప్పుడూ దాచిపెట్టలేదు. అలాంటిది పెళ్లి విషయాన్ని ఎలా దాచిపెడుతుందని కొంతమంది వాదిస్తున్నారు. అయితే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కాబోలు అందుకే అలా పిలిచి ఉంటుందని మరికొంతమంది అంటున్నారు.