Mounika: ఈ భర్త తనకొద్దంటూ... పెళ్లయిన నాలుగు నెలలకే ఆత్మహత్య... సెల్ఫీ వీడియో!

  • ఆగస్టులో మౌనిక వివాహం
  • మూడు నెలల గర్భవతి
  • భర్త అంటే ఇష్టం లేదని చెబుతూ ఆత్మహత్య

పెద్దలు ఇష్టం లేకుండా పెళ్లి చేశారో... లేక కట్టుకున్న భర్త నచ్చలేదో... పెళ్లయిన నాలుగు నెలలకే ఓ నవ వధువు తన ప్రాణాలు తీసుకుంది. మరణించే ముందు తన నిర్ణయానికి కారణాలను చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కలకలం రేపిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు.

పట్టణంలోని 30వ వార్డులో ఉండే రైల్వే పార్శిల్‌ సర్వీస్‌ ఉద్యోగి ఉద్దండి వీరవెంకట నాగేశ్వరరావు కుమార్తె మౌనిక (24)ను గత ఆగస్టులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి, ఒంగోలుకు చెందిన తిరుమలశెట్టి నరేంద్రకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన తరువాత నరేంద్ర ఉద్యోగం చేస్తున్న బెంగళూరుకు వెళ్లింది మౌనిక. ఆపై ఆమె గర్భవతికాగా, నెల రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది.

బెంగళూరులో ఏం జరిగిందో ఏమో... తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకన్నా ముందు భర్త అంటే తనకు ఇష్టం లేదని, అందుకే చనిపోతున్నానని వీడియో రికార్డు చేసింది. మౌనిక ఆత్మహత్యపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, వీడియోను స్వాధీనం చేసుకుని కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.

Mounika
West Godavari
Sucide
  • Loading...

More Telugu News