Chennai: గెలుపు దిశగా దినకరన్.. శశికళ వర్గీయుల హడావుడి.. రంగంలోకి దిగిన పారా మిలిటరీ!

  • తిరిగి ప్రారంభమైన కౌంటింగ్
  • 10 వేల ఓట్లకు పైగా మెజారిటీలో దినకరన్
  • అన్నాడీఎంకేను అప్పగించాలని కార్యకర్తల నినాదాలు

రాజ్ భవన్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన పారా మిలిటరీ దళాల పహారా నడుమ ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాల కౌంటింగ్ తిరిగి ప్రారంభం కాగా, శశికళ వర్గం తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ తన సమీప అన్నాడీఎంకే ప్రత్యర్థి మధుసూదనన్ పై 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఇక ఆయన గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఐదవ రౌండ్ లెక్కింపు కొనసాగుతుండగా, ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టు ముట్టారు. ఇక అన్నాడీఎంకే పగ్గాలను, సీఎం పదవిని దినకరన్ కు అప్పగించాలంటూ, అక్కడికి చేరిన శశికళ వర్గీయులు నినాదాలు చేస్తున్నారు. అంతకుముందు దినకరన్, అన్నాడీఎంకే ఏజంట్ల మధ్య జరిగిన గొడవ కారణంగా కౌంటింగ్ కాసేపు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Chennai
Tamilnadu
RK Nagar
TTV Dinakaran
  • Loading...

More Telugu News