Tamilnadu: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ... తొలి రౌండ్ లో టీటీవీ దినకరన్ ఆధిక్యం!

  • ఆధిక్యంలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్
  • 419 ఓట్ల ఆధిక్యంలో దినకరన్
  • మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం

చెన్నై పరిధిలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి శశికళ వర్గం అభ్యర్థి, టీటీవీ దినకరన్ 419 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే, శశికళ వర్గం అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. గెలుపుపై మూడు వర్గాలూ ధీమాను వ్యక్తం చేశాయి. కాగా, మొత్తం 19 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించగా, మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెల్లడవుతుందని సమాచారం.

Tamilnadu
RK Nagar
TTv Dinakaran
  • Loading...

More Telugu News