India: చాలా ఆందోళన చెందాను: టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ

  • టీమిండియాకు మళ్లీ ఎప్పుడు సార‌థ్యం వహిస్తానో తెలియదు
  • ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన మ్యాచ్‌లో చాలా ఒత్తిడికి గుర‌య్యాను
  • 120 కోట్ల మంది భార‌తీయుల‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆందోళ‌న‌
  • నిన్న‌టి టీ20లో అధిక ప‌రుగులు చేయాల‌నే ఆడా

తొలిసారి తాను టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండ‌డంతో ఒత్తిడి అనుభవించానని రోహిత్ శ‌ర్మ అన్నాడు. ప్ర‌స్తుతం రేపు ముంబయి టీ20 కోసం త‌నపై ఒత్తిడి ఉందని అన్నాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ... ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌తో పోలిస్తే టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు ఒత్తిడి అధికంగా ఉంద‌ని అన్నాడు.

శ్రీలంక‌తో ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన మ్యాచ్‌లో అతి తక్కువ పరుగులకే భార‌త్ బ్యాట్స్‌మెన్ ఔట్ అవుతుండ‌డంతో మ‌రింత ఒత్తిడికి గుర‌య్యాన‌ని, 120 కోట్ల మంది భార‌తీయుల‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో చాలా ఆందోళన చెందాన‌ని తెలిపాడు. తాను టైమింగ్‌పై ఆధారపడి బ్యాటింగ్ చేస్తున్నాన‌ని తెలిపాడు. త‌న‌ బలాలు, బలహీనతల గురించి త‌న‌కు తెలుసని చెప్పాడు. నిన్న‌ టీ20లో ద్విశతకం గురించి ఆలోచించలేదని, మరిన్ని పరుగులు చేయాల‌ని మాత్ర‌మే ఆలోచించాన‌ని అన్నాడు.

  • Loading...

More Telugu News