akhil: అఖిల్ నెక్స్ట్ మూవీ కోసం నాగ్ దృష్టిలో కొరటాల .. బోయపాటి?

  • 'హలో' అంటూ పలకరించిన అఖిల్ 
  • నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి 
  • దర్శకుల జాబితాలో సుకుమార్ పేరు కూడా 

అఖిల్ రెండవ సినిమా కథా కథనాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నాగార్జున 'హలో' సినిమాను నిర్మించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. ఇక వరుసగా సెలవులు ఉండటంతో, భారీ వసూళ్లు సాధించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో అఖిల్ తదుపరి సినిమాపై అంతా దృష్టి పెట్టారు. ఆయన తదుపరి సినిమాకి దర్శకుడు ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది. నాగ్ దృష్టిలో కొరటాల.. బోయపాటి వున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరితో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే ప్రచారం ఒక వైపున జరుగుతుండగా, మరో వైపున సుకుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అఖిల్ కోసం సుకుమార్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ ముగ్గురిలో ఎవరితో కలిసి అఖిల్ ముందుగా సెట్స్ పైకి వెళతాడో చూడాలి మరి.   

  • Loading...

More Telugu News