nani: 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' తొలిరోజు కలెక్షన్లు!

  • ఈ నెల 21న విడుదలైన 'మిడిల్ క్లాస్ అబ్బాయి'
  • తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల వసూళ్లు 
  • ఓవర్సీస్ లోను కొనసాగుతోన్న జోరు

వేణుశ్రీరామ్ దర్శకత్వంలో నాని చేసిన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, భూమిక కీలకమైన పాత్రను పోషించింది. నాని .. సాయిపల్లవికి గల క్రేజ్ కారణంగా ఈ సినిమా, తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను సాధించింది.

తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్లను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్లకి పైగా వసూలు చేసింది. అమెరికా . ఆస్ట్రేలియా .. ఇతర దేశాల్లోను ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ పోతుండటం విశేషం. ఆస్ట్రేలియా బాక్సాఫీస్ చార్టులో ఈ సినిమా 12వ స్థానంలో నిలిచిందని చెబుతున్నారు. ఇక నిన్న కూడా ఈ సినిమా అక్కడ 15.47 లక్షలను వసూలు చేసిందని అంటున్నారు. ఇక 'హలో' వివరాలు కూడా త్వరలో తెలియనున్నాయి.   

  • Loading...

More Telugu News