hardhik patel: అనుమతి లేకుండా బైక్ ర్యాలీ... హార్దిక్ పటేల్ పై ఎఫ్ఐఆర్ నమోదు!

  • హార్దిక్ తో పాటు మరో 50 మందిపై ఎఫ్ఐఆర్
  • ఐపీసీ 188 కింద కేసు
  • అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించిన హార్దిక్

పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ తో పాటు అతని అనుచరులు మరో 50 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 11వ తేదీన అహ్మదాబాద్ నగర శివారులో అనుమతి లేకుండానే రోడ్ షో నిర్వహించారనే కారణాలతో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ 188 ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ... తన మద్దతుదారులతో కలసి హార్దిక్ పటేల్ బైక్ ర్యాలీ నిర్వహించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా... బోపాల్ నుంచి నికోల్ ఏరియా వరకు ఈ ర్యాలీ కమ్ రోడ్ షో 15 కిలోమీటర్ల మేర సాగింది.

hardhik patel
  • Loading...

More Telugu News