కేంద్ర సాహిత్య అకాడమీ: 2017 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన.. తెలుగు రచయిత దేవిప్రియను వరించిన అవార్డు!

  • ‘గాలి రంగు’ కవితా సంపుటికి గాను దేవిప్రియకు అవార్డు
  • అనువాద విభాగంలో వీణా వల్లభరావుకు దక్కిన ప్రతిష్టాత్మక అవార్డు
  • ఫిబ్రవరిలో అవార్డుల ప్రదానోత్సవం

2017 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. తెలుగులో ప్రముఖ రచయిత దేవిప్రియ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన ‘గాలి రంగు’ కవితా సంపుటికి గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు కవిత్వానికి, జర్నలిజానికి ఆయన సేవలందిస్తున్నారు.

‘అమ్మచెట్టు’ ‘గరీబుగీతాలు’, ‘నీటిపుట్ట’, ‘అరణ్యపురాణం’ వంటి రచనలు చేశారాయన. అనువాద విభాగంలో వీణా వల్లభరావుకు ‘విరామమెరుగని పయనం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. పంజాబీ భాషలోని ఖానాబదోష్ ఆత్మకథను తెలుగులోకి వల్లభరావు అనువదించారు.

కాగా, 24 భాషల్లో ఈ అవార్డులను ప్రకటించారు.ఈ అవార్డులను ఫిబ్రవరిలో అందజేయనున్నారు. అవార్డు గ్రహీతలకు తామ్రపత్రం, లక్ష రూపాయల నగదును బహుమానంగా అకాడమీ అందజేస్తుంది.

  • Loading...

More Telugu News