Kajal Agarwal: ఆర్థికపరమైన ఇబ్బందులు .. ఆలోచనలో పడిన 'క్వీన్' నిర్మాత

  • నాలుగు భాషల్లో 'క్వీన్' రీమేక్ 
  • నలుగురు కథానాయికలు 
  • విదేశాల్లో షూటింగ్ 
  • దాటిపోయిన బడ్జెట్  

భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతలు .. బహు భాషా సినిమాలను నిర్మించే నిర్మాతలు అప్పుడప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడమనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. అలా 'క్వీన్' రీమేక్ కూడా ఇబ్బందుల్లో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి.

 హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్' ను తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తెలుగులో తమన్నా .. తమిళంలో కాజల్ .. కన్నడలో పరుల్ యాదవ్ .. మలయాళంలో మంజిమా మోహన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. తెలుగు .. మలయాళ భాషల్లో నీలకంఠ, తమిళ .. కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ ఫ్రాన్స్ లో నిర్వహించారు. అయితే, ముందుగా అనుకున్న బడ్జెట్ ప్లాన్ తేడా కొట్టడంతో, ఈ ప్రాజెక్టు ఆర్థికపరమైన కష్టాల్లో పడిందట. దాంతో ఏదో ఒక భాషలోని రీమేక్ ను ఆపేసే ఆలోచనలో నిర్మాత ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.      

Kajal Agarwal
thamannah
manjima
  • Loading...

More Telugu News