‘లీడర్ ఆఫ్ ది ఇయర్’: ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది: కేటీఆర్
- ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మంత్రి
- ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం
- ఉత్తమ పట్టణ మౌలిక వసతులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు
ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును తెలంగాణ మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఢిల్లీలో ఈరోజు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ చేతుల మీదుగా కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు.
కాగా, ఉత్తమ పట్టణ మౌలిక వసతులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ , పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఫొటోలను పోస్ట్ చేశారు. లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.