చంద్రబాబు: చంద్రబాబూ! ప్రజల కష్టాలను తీర్చడమే అసలైన 'అనుభవం'!: వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి

  • తోటి ప్రజాప్రతినిధులను గౌరవించడం నేర్చుకోవాలి
  • అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు
  • ప్రజా సంకల్పయాత్రలో విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు

ఏపీ సీఎం చంద్రబాబుపై ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమడలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తనకు ఎంతో పరిపాలనా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, ప్రజల కష్టాలను తీర్చడమే అసలైన అనుభవం అని తెలుసుకోవాలని, తోటి ప్రజాప్రతినిధులను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. టీడీపీకి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ఆయనకు రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News