సల్మాన్ ఖాన్: కాకినాడలో బీచ్ ఫెస్టివల్... సందడి చేయనున్న సల్మాన్, రెహ్మాన్!

• కాకినాడలో నిన్న ప్రారంభమైన ‘ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్’
• రేపు రెహమాన్ సంగీత విభావరి
• బీచ్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తున్న కాకినాడ వాసులు!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సందడి చేయనున్నారు. కాకినాడలో ‘ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్’ వేడుకల్లో భాగంగా రేపు నిర్వహించే కార్యక్రమాల్లో సల్మాన్, రెహ్మాన్ పాల్గొననున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రెహమాన్ సంగీత విభావరి జరగనుంది. అసలు ఈరోజు నిర్వహించనున్న వేడుకల్లో వాళ్లిద్దరూ పాల్గొనాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈరోజుకు బదులు రేపటికి వాయిదా పడింది.

‘ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్’ మూడు రోజులు జరుగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫ్లవర్ షో, ఆక్వేరియం, హెలీ పర్యాటకం, ప్యారా రైడింగ్, బీచ్ కబడ్డీ, వాలీబాల్, బోటింగ్ వంటి కార్యక్రమాలతో పాటు స్థానిక కళాకారులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘కార్నివాల్’ ఏర్పాటు చేశారు. నిన్న ప్రారంభమైన ‘ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్’లో ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరి నిర్వహించారు. కాకినాడలో నాలుగేళ్లుగా బీచ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.

కాగా, ఏఆర్ రెహ్మాన్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వేడుకను బీచ్ ఫెస్టివల్ లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన రెహమాన్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు.

కాకినాడలో సందడి చేయనున్న సల్మాన్, రెహ్మాన్!@arrahman #Kakinada pic.twitter.com/qTg6eCTu2y
— ap7am.com (@ap7am) December 20, 2017

• Loading...

More Telugu News