కేంద్ర మంత్రి సత్యపాల్: ‘గంగ’లో అస్థికలు మొత్తం కలపకండి: కేంద్ర మంత్రి సత్యపాల్ సూచన

  • మిగిలిన అస్థికలను నదీపరీవాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి, దానిపై ఓ మొక్క నాటాలి
  • గంగానదిలో కాలుష్యం అరికట్టేందుకు పాటుపడాలి
  • కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్

గంగానదిలో కాలుష్యాన్ని అరికట్టే నిమిత్తం నదిలో అస్థికలు మొత్తం కలపవద్దని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ సూచించారు. కొన్నిటిని మాత్రమే కలిపి, మిగిలిన అస్థికలను నదీపరీవాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి, దానిపై ఓ మొక్కను నాటాలని మంత్రి అన్నారు.

గంగా నదిలో అస్థికలు కలపడమనేది హిందువుల విశ్వాసమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని, ముందు తరాల వారికి కాలుష్య రహిత ‘గంగ’ను అందించాలంటే ఈ పద్ధతి పాటించక తప్పదని అన్నారు. ఇందుకుగాను, పురోహితులు, హిందూ ఆధ్యాత్మికవేత్తలు కృషి చేయాలని, ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు.

  • Loading...

More Telugu News