మేయర్ స్వరూప: ‘అనంత’ అభివృద్ధికి ఎంపీ జేసీ అర్ధరూపాయి కూడా ఖర్చుపెట్టలేదు: మేయర్ స్వరూప

  • అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ
  • జేసీ తెల్ల కళ్లద్దాలు పెట్టుకుంటే అభివృద్ధి పనులు కనబడతాయి
  • జేసీ రాజకీయాలకు గుడ్ బై చెబితే మంచిదని స్వరూప సలహా

అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని, వంద కోట్ల రూపాయలతో తాము అభివృద్ధి పనులు చేసినా ఆయనకు కనబడటం లేదని విమర్శించారు.

జేసీ తన నల్ల కళ్లద్దాలను తీసి తెల్ల అద్దాలను పెట్టుకుని చూస్తే ఆ అభివృద్ధి పనులు కనబడతాయని ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చుట్టపుచూపుగా మూడు నెలలకొకసారి అనంతపురం వచ్చే జేసీ తాము చేసిన అభివృద్ధి పనుల వైపు కన్నెత్తి కూడా చూడరని అన్నారు. పైగా, తాము చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని, ఇప్పటికైనా మంచి పనులు చేయాలని, జేసీ రాజకీయాలకు గుడ్ బై చెబితే మంచిదంటూ ఆమె ఓ సలహా ఇచ్చారు.  

  • Loading...

More Telugu News